Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విభేదాలు వీడి పార్టీ కోసం కృషి చేయాలి 

విభేదాలు వీడి పార్టీ కోసం కృషి చేయాలి 

- Advertisement -

– స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం 
– కామారెడ్డి డిసీసీ. అధ్యక్షుడు మల్లికార్జున 
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
విభేదాలు వీడి పార్టీ పటిష్టత కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదామని డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున అన్నారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులై మొట్టమొదటిసారిగా బాన్సువాడ నియోజకవర్గ బీర్కూర్ కు వచ్చిన మల్లికార్జున కు బుధవారం బీర్కూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు మల్లికార్జున తెలంగాణ తిరుమల దేవస్థానం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ, పార్టీ పటిష్టత కోసం సమష్టిగా ముందుకు సాగుదామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులను గెలిపించడంతో పాటు మండల  పరిషత్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి కాంగ్రెస్ నాయకులు శ్రేణులు కృషి చేయాలన్నారు.

గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే భవిష్యత్తులో జరగబోయే ఎంపిటిసి ,జడ్పీటీసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని దీనిని దృష్టిలో పెట్టుకొని వర్గ విభేదాలకు తావు కల్పించకుండా అందరూ సైనికులుగా పనిచేసే కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ శ్రేణులు కష్టపడాలని ఆయన సూచించారు. ఆయన వెంట సీనియర్ నేత బస్వరాజ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యామ రాములు. కాంగ్రెస్ యువజన నాయకుడు శశికాంత్, మేకల విఠల్ , దామరంచ సర్పంచ్ శంకర్, మాజీ ఎంపీపీ రఘు, దుంపల రాజు, మాజీ సర్పంచ్ అంబలి ప్రమీల, బ్రహ్మయ్య, సాలె కిరణ్ కుమార్, మద్నూర్ నర్సింలు, యాట వీరేశం. కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -