Wednesday, January 7, 2026
E-PAPER
Homeనల్లగొండఇంటర్మీడియట్‌లో వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలి

ఇంటర్మీడియట్‌లో వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలి

- Advertisement -
  • ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతపై కలెక్టర్ హనుమంతరావు సమీక్ష
    నవతెలంగాణ -భువనగిరి: ఇంటర్మీడియట్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కళాశాల ప్రిన్సిపల్స్ కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం మినీ మీటింగ్ హాల్లో జిల్లా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లడుతూ.. ప్రభుత్వము విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తునందున అదే దిశగా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యా బోధన చేయాలన్నారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాలలో కనీస సౌకర్యాలు లైటింగ్,బెంచీలు,ఫ్యాన్లు, మంచినీటి తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రాక్టికల్ పరీక్షల కోసం ల్యాబ్ మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున వెనకబడిన విద్యార్థులకు స్పెషల్ క్లాస్‌లు ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి పాస్ అయ్యేలా చూడాలన్నారు. పిల్లలకు అర్థమయ్యేలా విద్యా బోధన చేయాలన్నారు. గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా కళాశాల ప్రిన్సిపల్స్ కృషి చేయాలని అన్నారు. కళాశాలలో ఏమైనా సమస్యలు, మరమ్మత్తులు ఉంటే 20 రోజుల్లో పూర్తిచేయాలని ఆర్ అండ్ బి ఇంజనీర్లను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారిని రమణి, కళాశాల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -