మండల విద్యాధికారి విజయ్ కుమార్
నవతెలంగాణ- కుభీర్
మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదువుకునే పదవ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి 100% ఫలితాలను సాధించి జిల్లాలో మొదటి స్థానం సాధించేలా కృషి చేయాలని మండల విద్యాధికారి విజయ్ కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ సుధీర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు ఆరోగ్య సమస్యలను విద్యాభ్యాసం చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
మండల విద్యాధికారి విజయ్ మాట్లాడుతూ..పదవ తరగతి పరీక్షలకు సన్నద్ధమై విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే కేంద్రాల వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షలకు వెళ్లే ముందు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా.. ప్రశాంతంగా పరీక్షలకు వెళ్లాలన్నారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను మళ్లీ ఒకసారి చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్,సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



