Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడి కేంద్రాల్లో అందించే పోషకాహారాలను సద్వినియోగం చేసుకోవాలి..

అంగన్వాడి కేంద్రాల్లో అందించే పోషకాహారాలను సద్వినియోగం చేసుకోవాలి..

- Advertisement -

మహాదేవపూర్ ప్రాజెక్టు సిడిపిఓ రాధిక
నవతెలంగాణ – మల్హర్ రావు

అంగన్వాడి కేంద్రాల్లో గర్భిణీలకు, చిన్నారులకు, బాలింతలకు, చిన్న పిల్లల తల్లులకు అందించే పోషకారాలను సద్వినియోగం చేసుకోవాలని మహాదేవపూర్ ప్రాజెక్టు సిడిపిఓ రాధిక సూచించారు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా సోమవారం వళ్లెంకుంట సెక్టార్ పరిధిలోని అంగన్వాడి కేంద్రాల్లో సంపూర్ణ ఆరోగ్యం పోషణ మాసం సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగ సిడిపిఓ హాజరై గర్భిణీలు, బాలింతలకు పోషకారం, 1000 డేస్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి,చిన్న పిల్లల తల్లులుతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రీస్కూల్ పిల్లల శాతాన్ని పెంచాలని అంగన్ వాడి టీచర్లను ఆదేశించారు. గర్భిణీలు, బాలింతలు రక్తహీనత రాకుండా ఆకుకూరలు, గుడ్లు, పాలు, డ్రైఫ్రూట్స్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్లు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -