– రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కమిషన్ చైర్మెన్ దీపక్‌జాన్
నవతెలంగాణ-నిర్మల్
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులై న క్రైస్తవ మైనారిటీలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కమిషన్ చైర్మెన్ దీపక్ జాన్ అన్నారు. క్రైస్తవ మైనారిటీల సమస్యలపై నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ.. ఆయా నియోజకవర్గాల్లో చర్చి నిర్మా ణాల కోసం స్థలాల కేటాయింపు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, క్రైస్తవుల కుల, వివాహ ధ్రువీకరణ పత్రాల మంజూరు, సమాధుల కోసం స్థలాల కేటా యింపు.. ఇతర అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటా మని చెప్పారు.
క్రైస్తవ మైనారిటీల సమస్యల పరి ష్కారానికి తగిన సిఫారసులు ప్రభుత్వానికి పంపుతా మన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లా డుతూ.. క్రైస్తవ మైనార్టీల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభివృద్ధి, సంక్షే మ పథకాలు అర్హులైన క్రైస్తవులకు అందేలా సంబం ధిత శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. చర్చి, కమ్యూనిటీ హాల్ నిర్మాణ అనుమతుల విషయంలో అవసరమైన చర్యలు చేపడతామన్నారు. అంతకుముందు క్రైస్తవ సంఘాల ప్రతి నిధులు, పాస్టర్లు తమ సమస్యలను కమిషన్ చైర్మెన్ కు వివరించారు. అనంతరం కలెక్టర్, చైర్మెన్‌ను శాలువా తో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. సమావేశం లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నాకల్యాణి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మోహన్ సింగ్, అసోసియేట్ పాస్టర్లు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES