- Advertisement -
మాజీ ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్
నవతెలంగాణ-రామారెడ్డి
స్థానిక సంస్థల్లో గులాబీ జెండా ఎగిరేల అందరు కలిసికట్టుగా గులాబీ శ్రేణులు పనిచేయాలని మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. మంగళవారం గొడుగు మర్రి తండా బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు బాణావత్ రాజు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంగా, మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో గంపను సన్మానించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సలవత్ బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్ గంగావత్ రాజు నాయక్, తదితరులు ఉన్నారు.
- Advertisement -