Saturday, September 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళల సమస్యల పరిష్కారానికి పాటుపడాలి

మహిళల సమస్యల పరిష్కారానికి పాటుపడాలి

- Advertisement -

ప్రొఫెసర్‌ కోదండరాం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రవ్యాప్తంగా మహిళల సమస్యల పరిష్కారానికి పాటుపడాలని టీజేఎస్‌ మహిళా విభాగం సభ్యులను ఆ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం కోరారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని టీజేఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో మహిళా విభాగం అధ్యక్షురాలు రాగులపెల్లి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో కోదండరాంతో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినరు కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా జన సమితి కమిటీల నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా జన సమితి నాయకులు అరికిల్ల స్రవంతి, వి.పుష్పలత, లక్ష్మి, బి.లావణ్య, ఎస్‌. రేఖ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -