Saturday, December 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుష్టు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి

కుష్టు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి

- Advertisement -

డిప్యూటి పారా మెడికల్ ఆఫీసర్ వనాకర్ రెడ్డి 
నవతెలంగాణ- పెద్దవంగర
కుష్టు రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తొర్రూరు డివిజన్ డిప్యూటి పారా మెడికల్ ఆఫీసర్ వనాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని రామచంద్రు తండాలో కొనసాగుతున్న కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కుష్టు వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుష్టు వ్యాధి నియంత్రణకై ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపడుతుందన్నారు. వ్యాధి గ్రహస్తులను సకాలంలో గుర్తించి, వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. రోగులకు ప్రభుత్వం ఉచితంగా మందులను పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 31 వరకు పక్కాగా సర్వే నిర్వహించి, కుష్టు వ్యాధి గ్రహస్తులను గుర్తించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం హరిత, ఆశా కార్యకర్తలు కవిత, సునిత, మంజుల, శోభ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -