Tuesday, December 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి: ఎంపీ చామల 

గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి: ఎంపీ చామల 

- Advertisement -

నవతెలంగాణ ఆలేరు 
ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు ఉపసర్పంచ్లు వార్డ్ మెంబర్లు గ్రామ అభివృద్ధి దేంగా పనిచేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట లోని శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ లో సర్పంచులకు జరిగిన ఆత్మీయ సన్మాన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం నుండి వస్తున్న పథకాలను ప్రజలకు చేరే విధంగా ప్రజా ప్రతినిధులు పని చేయాలన్నారు.వచ్చిన పథకాలు కాంగ్రెస్ పార్టీ వల్లే వచ్చిన విషయాన్ని వారు ప్రజల దృష్టికి తేవాలన్నారు.నిరంతరం ప్రజల కష్టసుఖాల్లో భాగం పంచుకున్నప్పుడే వ్యక్తిగతగా రాణించడంతో పాటు  నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయి తద్వారా కాంగ్రెస్ పార్టీ  మరింత పటిష్టంగా మారుతుంది అన్నారు.

రాబోయే ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా ఐక్యమత్యంతో పని చేస్తే నియోజకవర్గం లో అన్ని  స్థానాలు కాంగ్రెస్ అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య ఎస్ సి. ఎస్ టి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మహిళా  కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండ్లు శోభారాణి లతో కలిసి గెలుపొందిన ప్రజా ప్రతినిధులను శాలువాలు  పూలదండలతో సన్మానించారు నియోజవర్గం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు. ముందుగా యాదిగిరి గుట్ట పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -