– కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.వెంకటేష్
నవతెలంగాణ – ధూల్ పేట్
వినాయక నవరాత్రి ఉత్సవాలలో మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం మాజీ చైర్మన్ కె.వెంకటేష్ ప్రజలకు పిలుపునిచ్చారు. లాల్ దర్వాజా, గౌలిపుర ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం సమీపంలో ఉచితంగా మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రెండు వందల మట్టి విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టర్ విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేస్తే జలాశయాలు కలుషితం అవుతాయన్నారు.
దీన్ని నియంత్రణకు భక్తులు మట్టి విగ్రహాలను పూజించాలని అప్పుడే తమ పూర్వీకులు భక్తి వారసత్వం, సాంప్రదాయాలను కొనసాగించిన వారమవుతామని అన్నారు. మండపాల వద్ద పెద్దలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలకు ఆర్య వైశ్య సంఘం తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లాల్ దర్వాజా,గౌలిపుర ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు సరాబు సంతోష్ కుమార్ గుప్త, ప్రధాన కార్యదర్శి చాలిక నాగరాజు గుప్త, సంఘం ప్రతినిధులు గుగ్గిళ్ళ సంతోష్ కుమార్ గుప్త, రవి కుమార్ గుప్త, సతీష్ గుప్త, నాగేష్ గుప్త, అశోక్ కుమార్ గుప్త, రాములు గుప్త, విశ్వేశ్వర గుప్త, శివ కుమార్ గుప్త తదితరులు పాల్గొన్నారు.
మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES