Monday, May 19, 2025
Homeతెలంగాణ రౌండప్మాల మహానాడు పిలుపును తీవ్రంగా ఖండిస్తున్నాం 

మాల మహానాడు పిలుపును తీవ్రంగా ఖండిస్తున్నాం 

- Advertisement -

ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నాంపల్లి 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య నిజామాబాదులో జరిగిన సమావేశంలో వర్గీకరణను అడ్డుకోవాలని పిలుపునివ్వడాన్ని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నాంపల్లి ఖండించారు. ఈ మేరకు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. నిజమైన అంబేద్కర్ వారసులు మాలలు అని చెప్పుకుంటున్నా చేన్నయ్య సామాజిక న్యాయాన్ని కోరుకోలేనివారు అంబేద్కర్ వారసులు ఎట్లా అయితరో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజమైన అంబేద్కర్ వారసులు షెడ్యూల్ కులాలలో ఉన్న 59 కులాలకు వారి జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం కోరుకుంటారని నాంపల్లి తెలిపారు. నిజంగా మీరు దళితుల సంక్షేమం కోరుకుంటే రిజర్వేషన్లు పెంచాలని రాజ్యాధికారంలో మా వాటా మాకు కావాలని కలిసి పోరాటం చేద్దాం రండి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -