– జిల్లా కమిటీ సీపీఐ(ఎం) సభ్యులు ఎం.ఏ ఇక్బాల్
నవతెలంగాణ – ఆలేరు రూరల్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని భువనగిరి జిల్లా కేంద్రంలో దీక్ష చేపడుతున్న సీపీఐ(ఎం) నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని జిల్లా కమిటీ సీపీఐ(ఎం) సభ్యులు ఎం ఏ ఇక్బాల్ ఖండించారు. శుక్రవారం ఆలేరు పట్టణ కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఆమోదించిన 42% రిజర్వేషన్లను వెంటనే పార్లమెంటులో బిల్లు ఆమోదింప చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేయాలనుకున్న సీపీఐ(ఎం) నాయకులు జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ బట్టుపల్లి అనురాధ ఇతర జిల్లా నాయకత్వాన్ని అరెస్టు చేసి దీక్ష కార్యక్రమాన్ని భగ్నం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో దీక్ష చేయవచ్చు కానీ సీపీఐ(ఎం) నాయకులు జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం కోసం దీక్ష చేయడాన్ని ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకోవడంలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని శంకించవలసి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు 42 శాతం రిజర్వేషన్ల కోసంఫోటోల ఫోజుల కోసం ఢిల్లీలో ఫోటోలు దిగడం కాదు నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కింది స్థాయిలో జనం లోకి వెళ్లి ప్రజా పోరాటాన్ని నిర్మించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కేవలం బీసీ రిజర్వేషన్లను నినాదాలకి పరిమితం చేస్తే భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఆయనతోపాటు మోరిగాడి రమేష్ వడ్డేమాన్ బాలరాజు తాళ్లపల్లి గణేష్ గణగాని మల్లేష్ బొబ్బిలి యాదగిరి చిన్న రాజేష్ కాసుల నరేష్ తదితరులు ఉన్నారు.
సీపీఐ(ఎం) నాయకుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES