రక్షణ చట్టానికి న్యాయవాది పరిషత్ డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్
హైదరాబాద్ అత్తాపూర్‌లో న్యాయవాది మహమ్మద్ ఖదీర్ ని శనివారము రోజు తన ఆఫీసులోనే దారుణంగా హత్య చేయడం అత్యంత హీనమైన చర్యగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ పేర్కొన్నారు. న్యాయవాదులపై జరుగుతున్న ఇలాంటి విషయాలు హింసాత్మక దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు సవాల్‌గా మారుతున్నాయి.
ఈ హత్యకు పాల్పడ్డ దుండగులను వెంటనే గుర్తించి, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకొని, అత్యంత కఠోర శిక్ష విధించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు పోలీస్ శాఖను న్యాయవాది పరిషత్ డిమాండ్ చేస్తోంది. మృతుని కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తామని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ న్యాయవాదులు సేవా దృక్పథంతో నిర్వహిస్తున్న ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు హత్యలు పెరిగిపోవడని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు న్యాయ వ్యవస్థ రక్షణకై ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకుని న్యాయవాద ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.



