మాస్కో : అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ), పశ్చిమ దేశాలతో సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇరాన్ చేపడుతున్న చర్యలకు మద్దతు ఇస్తామని రష్యా సోమవారం ప్రకటించింది. సోమవారం ఇరాన్ మీడియా సంస్థలతో రష్యా విదేశాంగమంత్రి సెర్గీలావ్‌రోవ్ మాట్లాడారు. ఐఏఈఏ ,సాధారణంగా పశ్చిమదేశాలతో దాని సంబందాలతో సహా సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇరాన్ చేపడుతున్న చర్యలకు తాము మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అంతర్జాతీయ చట్టాన్ని బలహీనపరచడమే కాకుండా, ఇరాన్ అణు ఒప్పందం కూడా రాజీ పడిందని ఆయన పేర్కొన్నారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) ప్రకారం అన్ని పక్షాలు దీనిని అమలు పరచడానికి బాధ్యత వహిస్తాయని అన్నారు. రష్యా ఇరాన్‌తో ప్రస్తుత పరిస్థితిపై అధ్యక్ష స్థాయితో సహా వివిధ స్థాయిల్లో చర్చలు జరిపిందని అన్నారు. పరిస్థితిని ఎలా పరిష్కరించాలో, ఐఏఈఏ, పాశ్చాత్య దేశాలతో సంబంధాలను ఎలా పునరుద్ధ రించాలో వారు అభిప్రాయాలను పంచుకున్నారని అన్నారు. తుది నిర్ణయం ఇరాన్ ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. రష్యా, ఇరాన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించేందుకు తగిన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, ఈ ప్రక్రియను అన్ని విధాలా ప్రోత్సహించాలని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్ చర్యలకు మద్దతిస్తాం : రష్యా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



