- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ను స్వాగతిస్తూ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఏ కూనంని సాంబశివరావు అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. ఉగ్రవాదానికి కులం, మతం, దేశం లేదని, గతంలో మాజీ ప్రధాన మంత్రి బెనజీర్ భుట్టోను, ముజఫర్ రెహమాన్ ను హత్య చేసింది వారేనన్నారు. కేంద్ర ప్రభుత్వం పక్కా కార్యచరణతో ముందుకు సాగేలా అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
- Advertisement -