నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ నాయకులు
నవతెలంగాణ – కంఠేశ్వర్ : ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు రాసిన లేఖను తాము సమర్థిస్తున్నామని నిజామాబాద్ జిల్లా రూరల్ బిఆర్ఎస్ నాయకులు తెలిపారు. జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కవిత బి ఆర్ ఎస్ పటిష్టత కోసం ఎంతో కృషి చేస్తున్నారని, నిత్యం కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పాలనపై ప్రశ్నిస్తున్నారని వారు అన్నారు. మహిళా రిజర్వేషన్ విషయంలో గానీ, అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహ విషయంలో గానీ ఇలా అనేక విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు ఎండ కడుతున్నారని అన్నారు. కేసీఆర్ కు కవిత రాసిన లేఖలో మంచి వాలెబుల్ పాయింట్స్ ఉన్నాయని అన్నారు. అధికారం పోయాక కేసీఆర్ చుట్టూ ఉన్న కోవర్టులను గుర్తించాలని, క్రింది స్థాయి కార్యకర్తను కూడా గుర్తించాలని కవిత లేక రాసిందని అన్నారు. పార్టీ పటిష్టత కోసమే కవిత లేఖ రాశారని ఈ సందర్బంగా నాయకులు స్పష్టం చేశారు. వీటిని తమ అధినేత కేసీఆర్ గుర్తించి వాటిపై దృష్టి పెట్టాలని కోరారు. కవితకు మేమంతా అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు బాదావత్ రమేష్ నాయక్, ఎక్స్ ఎంపీపీ ఇందల్వాయి మండలం, డికొండ సుదీర్ ఎంపీటీసీ లోలం, శ్రీనివాస్ గుప్తా ఎంపీటీసీ అన్సాన్పల్లి, బి పరుశురాం నాయక్ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కవిత లేఖను సమర్థిస్తున్నాం: బీఆర్ఎస్ నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES