కొత్తపెళ్లి ఆనంద్ యాదవ్ …
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : యాదవ విద్యావంతుల వేదిక ఆగస్టు 25న 2023 లో శుభం కన్వెన్షన్ నాగోల్ లో యాదవ యుద్ధబేరి సభను ఏర్పాటు చేశారు. 33 జిల్లాల యాదవులను ఏకం చేసి దాదాపు 15వేల మందితో సభలు నిర్వహించారు. అందులో కులగణన వెంటనే చేపట్టాలని, విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనగణన అందులో కులగణనను వెంటనే చేపట్టాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వం కులగణనను పూర్తి చేసి, కేంద్రానికి బిల్లు పంపినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, కులగణనకు ఆమోదం తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. దీన్ని విద్యావంతుల వేదిక సాధించిన విజయంగా భావిస్తున్నామని, రాష్ట్రంలో ఎస్ ఎన్ టి రిజర్వేషన్ పునరుద్ధరణ, యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, రానున్న రోజులలో యాదవులకు మరిన్ని పదవులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
కులగణనను స్వాగతిస్తున్నాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES