టీజీపీడబ్ల్యూయూ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ సలావుద్దీన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ నమోదు, సామాజిక భద్రత, సంక్షేమ బిల్లును స్వాగతిస్తున్నామని తెలంగాణ గిగ్ మరియు ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ సలావుద్దీన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. దీనికి సహకరించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజకీయ పార్టీలు, సివిల్ సొసైటీ సంస్థలు, విద్యాసంస్థలు, ఉద్యమకారులు, మీడియాతో పాటు ఎన్జీఓలకు కతజ్ఞతలు తెలిపారు. బిల్లులో ప్లాట్‌ఫాం గిగ్ వర్కర్లకు చట్టపరమైన గుర్తింపు, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, యూనిక్ ఐడీతో ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్, సామాజిక భద్రతా నిది, కాంట్రిబ్యూషన్, ప్రభుత్వ గ్రాంట్లు, సీఎస్‌ఆర్ నిధులు వంటి అనేక చర్యల్ని ఈ బిల్లులోపొందుపరిచారని తెలిపారు. తక్షణం ఈ బిల్లును అమల్లోకి తేవాలని కోరారు.
గిగ్‌వర్కర్స్ బిల్లును స్వాగతిస్తున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



