– 2024 జులై 1 నుంచి రిటైర్డ్ అయినవారికీ వర్తింపజేయాలి: స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలను, 65 ఏండ్లకు ఉద్యోగ విరమణ వయస్సును పెంచడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) ప్రకటించింది. అయితే, 2024 జూలై ఒకటో తేదీ నుంచి రిటైర్డ్ అయిన ప్రతి ఒక్కరికీ ఇది వర్తింపజేయాలని కోరింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సునీత, పి.జయలక్ష్మి, కోశాధికారి పి.మంగ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీచర్లకు రిటైర్డ్ బెనిఫిట్స్‌ను లక్ష రూపాయల నుంచి రూ.2 లక్షలకు, హెల్పర్లకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచడం శుభపరిణామం అన్నారు. తమ యూనియన్ నిరంతర పోరాటాల ద్వారానే ఈ విజయం సాధ్యమైంద న్నారు. డైరెక్టరేట్ ముందు ధర్నా జరిగిన సమయంలో రిటైర్డ్ బెనిఫిట్స్ పెంచుతామనీ, వీఆర్‌ఎస్ సౌకర్యం కల్పిస్తామనీ, 2024 జూలై ఒకటి తర్వాత రిటైర్డ్ అయ్యే టీచర్లు, హెల్పర్లకు ఈ సౌకర్యాలు వర్తింపజేస్తామని డైరెక్టర్ ఇచ్చిన హామీని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో 2024 జూలై ఒకటో తేదీ నుంచి విధుల నుంచి తొలగించబడ్డ అంగన్‌వాడీటీచర్లు, హెల్పర్లందరీ రిటైర్డ్ బెనిఫిట్స్ వచ్చేలా జీవోను సవరించాలని కోరారు.
ఉద్యోగ విరమణ ప్రయోజనాల పెంపును స్వాగతిస్తున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES