Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం..

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం..

- Advertisement -

పీఏసీఎస్ చైర్మన్, బిసి సంఘం రాష్ట్ర నాయకుడు ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 9పై సుప్రీంను ఆశ్రయించగా కోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్, బిసి సంఘం రాష్ట్ర నాయకుడు ఇప్ప మొండయ్య మంగళవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 9ను వ్యతిరేకిస్తూ మాధవరెడ్డి హైకోర్టులో పిటీషన్ వేయగా.. ఈనెల 4న గోపాల్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారని, దానిని కోర్టు కొట్టివేయడం అభినందనీయమన్నారు. హై కోర్టులోనూ బీసీలకు అనుగుణంగా తీర్పు వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం సిద్ధించిన నాటినుంచి నేటివరకు బీసీలకు అన్నిరంగాల్లోనూ తీరని అన్యాయం జరిగిందని, ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపునకు ముందుకొచ్చిన సమయంలో కేసుల పేరుతో కాలయాపన చేయడం భావ్యం కాదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -