Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలను సాధిస్తాం..

కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలను సాధిస్తాం..

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలను సాధిస్తామని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మల్లేష్ అన్నారు. శుక్రవారం అమ్రాబాద్ మండలంలోని తెలుగు పల్లి గ్రామంలో ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. ఈ నేపథ్యంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ వర్ధంతి సభకు సిఐటియు నాయకులు జి.పర్వతాలు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి అట్టడుగు వర్గాల ప్రజల కోసం పనిచేసినటువంటి గొప్ప నాయకుడని అన్నారు.

1975లో ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు సీతారాం ఏచూరి ఢిల్లీ జవహర్లాల్ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అప్పుడు ఇందిరా గాంధీ జవహర్లాల్ యూనివర్సిటీకి చైర్మన్ గా ఉన్నది. ఆమె పదవికి రాజీనామా చేయాలని 5000 మంది విద్యార్థులతో ఆమె ఇంటిని ముట్టడి చేసి, ఆమె పదవికి రాజీనామా చేయించిన మహా నాయకుడు సీతారాం ఏచూరి అని కొనియాడారు.  ప్రస్తుతము దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు బిజెపి, ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకుపోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారని అన్నారు.

ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులను టార్గెట్గా పెట్టుకుని, వీరిపై విపరీతంగా దాడులు చేస్తున్నారని తెలిపారు. వీటిని ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. జీఎస్టీ రేట్లు తగ్గించడం అంటే…బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి జీఎస్టీ రేట్లు తగ్గించారే కానీ,  దేశ ప్రజలపై ప్రేమ ఉండి కాదని తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్లు గట్టి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

వీటికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. వీటిని అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు పుట్ట శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ నాయకులు కే.చరణ్,  గ్రామస్తులు కే.బాలస్వామి, జి జగన్నాథం, బి కేశవులు, ఎన్ వెంకటేశ్వర్లు, ఎన్ జైపాల్,  సత్యం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -