Thursday, July 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ రాష్ట్రానికి ఎరువుల కొరత తీరుస్తాం

తెలంగాణ రాష్ట్రానికి ఎరువుల కొరత తీరుస్తాం

- Advertisement -

సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర సర్కారు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణ రైతాంగానికి ఎరువుల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా రాష్ట్రానికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నడ్డాను కలిసింది. రాష్ట్రానికి సరిపడినంత యూరియా, ఎరువులను సరఫరా చేయాలని సీఎం రేవంత్‌ కోరారు. సీఎం విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈమేరకు బుధవారం సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వానాకాలం సీజన్‌కు సంబంధించి జూలై, ఆగస్టు నెలల్లో యూరియాను నిరాటంకంగా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరిన విషయం తెలిసిందే. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి…రైతుల అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని నడ్డా హామీ ఇచ్చారు. రాష్ట్రానికి అవసరం మేరకు యూరియాను సరఫరా చేయాలని ఎరువుల శాఖ ఉన్నతాధికారులను అధికారులను నడ్డా ఆదేశించారు. యూరియాను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా తగిన చర్యలు తీసుకోవాని సూచించారు.అన్ని జిల్లాలకు సమానంగా ఎరువులు పంపిణీ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో యూరియా వినియోగం పెరగడంపై కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 యాసంగితో పోలిస్తే 2024-25 యాసంగిలో యూరియా అమ్మకాలు 21శాతానికి పెరిగాయని గుర్తు చేశారు. రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రణామ్‌ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలను అందిస్తోందని ఈ సందర్భంగా జేపీ నడ్డా ప్రస్తావించారు.న

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -