నవతెలంగాణ – వెల్దండ
విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో అసెంబ్లీ ముట్టడికి వెనకడుగు వేయమని పిడిఎస్ యు రాష్ట్ర నాయకుల సంతోష్ అన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్ యు, తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది.ఈ సందర్భంగా వెల్దండ మండల కేంద్రంలోని ఆయా పాఠశాలలు, జూనియర్ కాలేజిల తరగతులు బహిష్కరించి బంధు నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు కార్పొరేట్ స్కూల్ లలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ , డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని, గురుకుల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఇతర విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు , అసెంబ్లీని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోవిద్యార్థి నాయకులు వినోద్, కార్తీక్ ,అనిల్ ,రామ్ , సాయి, నితిన్ ,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES