మాజీమంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్
నవతెలంగాణ – తిమ్మాజిపేట
చిన్నారిని చంపిన ఘటనలో నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపకపోతే హైదరాబాద్‌ను దిగ్బందిస్తామని, ముఖ్యమంత్రి ఇంటిని, సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వారం రోజుల సమయం ప్రభుత్వానికి ఇస్తున్నామని అన్నారు. కుమ్మెర జాతర ఘటనలో చిన్నారిని కోల్పోయిన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌లో అంబేద్కర్ కూడలిలో జరుగుతున్న దీక్షా శిబిరాన్ని గురువారం తలసాని శ్రీనివాస్ యాదవ్ బృందం సందర్శించి బాధితులను పరామర్శించింది. రెండు నెలల పాపకు కుమ్మెర జాతరలో ఘటనకు ఏమి సంబంధం అని పెద్దల మధ్య ఘర్షణ చిన్నారి ప్రాణాలను బలిగొనడం బాధాకరమన్నారు.
కుల అహంకారంతో ఈ దాడి జరిగిందని దీనికి బాధ్యులైన వారు ఎంతటి వారైనా పార్టీలకు అతీతంగా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఐక్యమత్యంతో ఉంటూ ఇలాంటి సంఘటనలను తిప్పి కొట్టాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని బహుజనలు అందరూ కలిసి రాష్ట్రవ్యాప్తంగా చేయాలన్నారు. అగ్రవర్ణ దాడులను తిప్పి కొట్టాలంటే బహుజనులలో ఐక్యత అవసరమన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బైకాని శ్రీనివాస్ యాదవ్ వివిధ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
చిన్నారి హంతకులను అరెస్టు చేయకపోతే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


