– గ్రామీణవైద్యం లో మీదే ప్రముఖ పాత్ర
– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
గ్రామీణ ప్రాంతాల్లో కాలానుగుణంగా వచ్చే వ్యాధులకు ప్రజలకు స్వాంతన కలిగించేది,ప్రాధమిక వైద్యం చేయడంలో ఆర్ఎంపీ లదే ప్రధాన పాత్ర అని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని వినాయకపురం చిలకల గండి ముత్యాలమ్మ దేవాలయం ప్రాంగణం లో ఏర్పాటు చేసిన ఆర్ఎంపీడబ్ల్యుఏ మండల స్థాయీ సమావేశంలో ముఖ్య అతిథి గా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎంపీ లు తమ పరిధులు దాటి వైద్యం చేయవద్దని, ఆర్ ఎం పి ల విషయాన్ని అసెంబ్లీ లో చర్చిస్తానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది ప్రాణాలు కాపాడేది ఆర్ఎంపీ లేనని అన్నారు. తనకు విద్య,వైద్యం అంటే చాల మక్కువ అని మొదటి ప్రాధాన్యత వాటికే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీడబ్ల్యూఏ జిల్లా అధ్యక్షులు కొమరయ్య, రామ్మూర్తి,రాంబాబు,ఆత్మ (బీఎఫ్ఏసీ) చైర్మెన్ సుంకవల్లి వీరభద్ర రావు,గ్రామీణ ప్రాంత వైద్యులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఏర్పాటు
అశ్వారావుపేట మండలం ఆర్ఎంపీడబ్ల్యుఏ మండల నూతన కమిటీ అయింది. అధ్యక్షులు షేక్ బాబా,గౌరవ అధ్యక్షులుగా ఖాసీం భక్షి,కార్యదర్శి గా పంబి ప్రసాద్, జాయింట్ కార్యదర్శి అజీజ్,ఉపాధ్యక్షుడు తాతారావు, కోశాధికారి వి.సత్యనారాయణ,ఆర్గనైజింగ్ కార్యదర్శి జే.బాబురావు, మీడియా కో ఆర్డినేటర్ సయ్యద్ హజరత్ అలీ, ప్రచార కార్యదర్శిగా జల్లి సతీష్ లక్ష్మణ్ నాయక్, సహాయ కార్యదర్శి గా వి ప్రసాద్, మహిళా ప్రతినిధి రీనా సర్కార్ ను ఎన్నుకున్నారు.


