అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
వస్త్ర వాణిజ్య పాఠశాలలు అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. కనీస వేతనాల కోసం జిల్లా వ్యాప్తంగా ఉద్యమం నిర్మిస్తామని అన్నారు. బుధవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ సమావేశంలో జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తూ సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ మాట్లాడారు. జిల్లాలో కార్మికుల స్థితిగతులపై రిపోర్ట్ ప్రవేశపెట్టారు. జిల్లాలో నిర్వహిస్తున్న వాణిజ్య సముదాయాలు వస్త్ర షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలో పనిచేస్తున్న కార్మికులకు అలాగే ప్రైవేటు విద్యాసంస్థలు కళాశాలలో పనిచేస్తున్న టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి బస్సు డ్రైవర్లకి అదే విధంగా జిల్లాలో ఇతర ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకి ఎక్కడా కనీస వేతనాలు అమలు కావడం లేదని అన్నారు. వెంటనే కనీస వేతనాలను సవరించి ప్రకటించాలని వాటిని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రంగానికి కోరారు.
కార్మిక చట్టాల పరిధికి లోబడి కార్మికులతో 8 గంటలు మాత్రమే పని చేయించుకోవాలి కానీ 10 నుండి 12 గంటల వరకు పని చేయించుకుంటూ కనీస వేతనాలు చెల్లించకుండా కార్మికులను వేతన బానిసలుగా మారుస్తున్నారని అన్నారు. పనిప్రదేశాల్లో మహిళా కార్మికులకు కార్మికులకు కనీస మౌళిక సౌకర్యాలను కల్పించడం లేదన్నారు. కార్మిక శాఖధికారులు తనిఖీలు నిర్వహించాలి కానీ ఆ శాఖలోనే పోస్టులు ఖాళీలుగా ఉన్న పరిస్థితి ఉన్నదన్నారు. ఈ పద్ధతికి ఇకనైనా స్వస్తి పలకాలని లేనిపక్షంలో జిల్లాలోని కార్మికులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటాన్ని నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా ప్రతినిధులలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న పాల్గొన్నారు.
కనీస వేతనాల కోసం ఆదిలాబాద్ వ్యాప్తంగా ఉద్యమం నిర్మిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES