Wednesday, January 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలురాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతాం: మంత్రి పొంగులేటి

రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతాం: మంత్రి పొంగులేటి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో గత పాలకుల హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణను సరిచేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ, ఒకే నియోజకవర్గంలోని మండలాలు వేర్వేరు జిల్లాల్లో ఉండేలా విభజన జరిగిందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో క్యాబినెట్‌లో చర్చించి, అధికారుల నివేదికల ఆధారంగా శాసనసభ ఆమోదంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -