హుస్నాబాద్ సస్యశ్యామలంగా ఉండాలి : పొట్లపల్లిలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ప్రభాకర్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ ప్రాంతమంతా సస్య శ్యామలంగా ఉండాలని, వర్షాలు పడి పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం శివరాత్రి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి, హుస్నాబాద్‌లో ఆలయాలను సందర్శించారు. పొట్లపల్లిలో స్వయం భూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వచ్చే శివరాత్రికి గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసుకొని కాలువల ద్వారా నీళ్ళు వచ్చి ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేలా కృషిచేస్తామని తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా భవిష్యత్‌లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా ఆ భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలని వేడుకున్నట్టు చెప్పారు.
వచ్చే శివరాత్రికి గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



