నవతెలంగాణ – కంఠేశ్వర్
వి ఎస్ అచ్యుతానందన్ ఆశయాలను కొనసాగిస్తామని సీపీఐ(ఎం) సంతాప సమావేశంలో నాయకులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సీపీఐ(ఎం) పార్టీ అగ్ర నాయకుల్లో ఒకరైన కేరళ మాజీ ముఖ్యమంత్రి, మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు వి ఎస్ అచ్చుతానందన్ అనారోగ్యంతో నూట ఒక్క సంవత్సరాలు జీవించి నిన్న ప్రాణాలు వదిలిన సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయం వద్ద పార్టీ జెండాను అవగాహతనం చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. 1940 సంవత్సరంలోని కమ్యూనిస్టు పార్టీలో 17 సంవత్సరాలు వయసులోనే సభ్యునిగా చేరి వి ఎస్ అచ్చితానందన్ అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించ పోరాటాలలో నాయకత్వం వహించారని శాసనసభ్యుడుగా 7 సార్లు ఎన్నికవ్వటంతో పాటు రెండుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసే అనేక ప్రజా ఉయోగ సంక్షేమ పథకాలను అమలు జరపడంతో పాటు సంస్కరణలను అమలు జరిపారని కేరళలో జరిగిన ప్రధాన ఉద్యమాలకు నాయకత్వం వహించి ఈ దేశంలో దోపిడీ లేని సమాజాన్ని నిర్మించాలని చివరి వరకు కృషి చేశారని ఆయన అన్నారు. ఆయన ఆశయ సాధనకు పార్టీ కృషి చేస్తుందని ఆయన లక్ష సిద్ది కోసం పాటుపడుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, జిల్లా కమిటీ సభ్యులు విగ్నేష్, సురేష్, నగర నాయకులు కటారి రాములు, అనసూయమ్మ, దినేష్, రాజు, ఉద్ధవ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.