– అదిరేది లేదు..బెదిరేది లేదు
– హెచ్‌కే ఆస్పత్రి తప్పులు సరిదిద్దుకోవాల్సిందే : పూర్ణిమ మండవ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హెచ్‌కే ఆస్పత్రి తమ తప్పులను ఒప్పుకుని సరిదిద్దుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అంతర్జాతీయ క్రీడాకారిణి, వెల్‌నెస్ ఆఫ్ ఉమెన్ ప్రయివేట్ లిమిటెడ్ ఎండీ పూర్ణిమ మండవ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న నకిలీ, అర్హత లేని డాక్టర్లు, అలాంటి వారితో నడుస్తున్న క్లినిక్‌లు, ఆస్పత్రులను తాము ఎండగడుతున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో హెచ్‌కే క్లినిక్‌కు సంబంధించిన సమాచారంతో ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నించినట్టు చెప్పారు. అయితే సోమవారం హెచ్‌కే ఆస్పత్రి నిర్వాహకులు మీడియా సమావేశం నిర్వహించి డీజీపీకి ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానంలో తమపై పరువు నష్టం దావా వేయనున్నట్టు హెచ్చరించారని తెలిపారు. అలాంటి బెదిరింపులకు అదిరేది, బెదిరేది లేదని పూర్ణిమ స్పష్టం చేశారు. తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. తాము ప్రశ్నలను లేవనెత్తిన తర్వాత అంటే 2024 తర్వాత ఆస్పత్రిలో మారిన వాటిని మాత్రమే హెచ్‌కే ఆస్పత్రి నిర్వాహకులు చెబుతున్నారనీ, అంతకు ముందు సంగతేంటని నిలదీశారు. 2024 తర్వాతైనా తప్పులు సరిదిద్దుకున్నందుకు తాము సంతోషిస్తున్నట్టు తెలిపారు. తమ పోరాటం తర్వాతే హెచ్‌కే ఆస్పత్రి డాక్టర్లను నియమించుకుందని తెలిపారు.
న్యాయవాది హనుమంతరావు మాట్లాడుతూ అర్హత లేని వైద్యుల చికిత్సలతో పలు సందర్భాల్లో దుష్ప్రభావాలతో పాటు కొన్ని సార్లు మరణాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ట్యాక్స్ ఎక్స్‌పర్ట్, హెచ్‌కే ఆస్పత్రి పూర్వ క్లయింట్ దుర్గాంజలి మాట్లాడుతూ, హెచ్‌కే ఆస్పత్రి జీఎస్టీ ఎగవేస్తున్నట్టు ఆరోపించారు. ఈ సమావేశంలో వెల్‌నెస్ ఆఫ్ ఉమెన్ ప్రయివేట్ లిమిటెడ్ డైరెక్టర్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
పోరాటం కొనసాగిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES