విద్యార్థికి అండగా నిలిచిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
నవతెలంగాణ – పాలకుర్తి
విద్యార్థి చదువులకు అయ్యే ఖర్చులను భరించేందుకు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిలు విద్యార్థి కుటుంబానికి భరోసా ఇచ్చారు. మండలంలోని కొండాపురం పెద్ద తండా కె గ్రామానికి చెందిన భూక్య వంశీ ఉన్నత చదువుల కోసం ఢిల్లీ యూనివర్సిటీలో అడ్మిషన్ రావడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకునే పరిస్థితి భారంగా మారడంతో చదువుల కోసం దాతలు ఆర్థిక సహాయాన్ని అందించాలని నవతెలంగాణలో కథనం ప్రచురితం అయింది. కథనాన్ని స్పందించిన దాతలు రూ.56000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మిగతా డబ్బుల కోసం పాలకుర్తి మార్కెట్ చైర్మన్ లావుడియా మంజుల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణలతో కలిసి వంశీ కుటుంబం చదువుకునేందుకు ఆర్థిక సహాయం కోసం ఝాన్సీ రెడ్డిని వేడుకున్నారు.
సహృదయంతో స్పందించిన టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దాతలు అందించిన సహాయం మినహాయించి చదువులకు కావలసిన సహాయాన్ని అందిస్తానని ఝాన్సీ రెడ్డి విద్యార్థి కుటుంబానికి మంగళవారం హామీ ఇచ్చారు. ఈనెల 18న ఝాన్సీ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని వంశీ చదువులకు రూ.50,000 అందిస్తానని ప్రకటించడంతో వంశీ కుటుంబ సభ్యులు ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉన్నత చదువుల కోసం పేదలకు చేయూతనిస్తామని తెలిపారు. ఉన్నత చదువులు చదివి స్థిరపడిన అనంతరం ఇతరులకు సహాయ పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు లావుడియా భాస్కర్ నాయక్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి చదువుల ఖర్చును భరిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES