Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీతారాంపురం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం

సీతారాంపురం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం

- Advertisement -

చీకటి మాయం లేని గ్రామంగా సీతారాంపురం ను తీర్చి దిద్దుకుంటాం
సీతారాంపురం గ్రామ సర్పంచ్ ధారావత్ భాస్కర్ 
నవతెలంగాణ – నెల్లికుదురు

మండలంలోని సీతారాంపురం గ్రామాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేస్తామని చీకటిమయం లేని గ్రామంగా సీతారాంపురం గ్రామానికి దిద్దుకుంటామని ఆ గ్రామ సర్పంచ్ ధారావత్ భాస్కర్ అన్నారు. మంగళవారం గ్రామంలో వీధులలో నూతన స్తంభాలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో అక్కడక్కడ రోజు వైర్లు ఉండి క్రిందికి ఏలాడుతున్నాయని ఆస్థానంలో మిడిల్ పోల్ లను నాటిస్తున్నామని అంతే కకుండా విరిగిపోయిన పోల్ స్థానంలో నూతన పోల్ నాటించి గ్రామంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

ప్రతి వీధిలో కరెంటు పోల్ ఉండి లైట్ ఉండాలని కరెంటుతో ఎవరికీ ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన తెలిపారు. అంతేకాకుండా గ్రామంలోని ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులను గుర్తిస్తూ ముందుగా ఏదైతే అవసరం ఉంటుందో అది ప్రత్యామ్నాయ ఏర్పాట చేస్తున్నామని చెప్పారు. గ్రామ అభివృద్ధి దఫాలుగా చేసి సీతారాం పౌరాణి బంగారు సీతారాంపురంగా మారుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవీన్ రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎరుపుల మల్లయ్య అంజయ్య మల్లయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -