నవతెలంగాణ-మెండోర
మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో నూతన పాలకవర్గాలు అధికారుల పర్యవేక్షణలో కొలువుదీరాయి. అందులో భాగంగా సావెల్ గ్రామంలో సోమవారం ఉదయం గ్రామపంచాయతీ ఆవరణలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకముందు అధికారుల సమక్షంలో నూతన పాలకవర్గం సభ్యులను పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. నూతన సర్పంచ్ కంచు శ్యామల ముత్యం సభా ముఖంగా మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రజలు సహకారంగా ఉండాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టో లో హామీ ఇచ్చిన ప్రకారం ప్రతీ కుటుంబానికి రెండు లక్షల రూపాయల జీవిత భీమా అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి నూతన సర్పంచ్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో అధికారులు , నూతన పాలకవర్గం సభ్యులు , గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



