Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వినియోగదారులను చైతన్య పరుస్తాం: కొడారి వెంకటేష్

వినియోగదారులను చైతన్య పరుస్తాం: కొడారి వెంకటేష్

- Advertisement -

వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు 
నవతెలంగాణ – ఆలేరు రూరల్

రేపటి నుంచి డిసెంబర్ 24 “జాతీయ వినియోగదారుల దినోత్సవం” వరకు జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్య పరుస్తామని  వినియోగదారుల సంఘం  యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ అన్నారు. శనివారం ఆయన ఆలేరు మండలం కొలనుపాక గ్రామం లో నవ తెలంగాణ విలేకరి తో మాట్లాడారు. చాలా మంది వినియోగదారులకు వినియోగదారుల రక్షణ “చట్టాలు 1986, 2018” చట్టాలపై అవగాహన లేని కారణంగా దోపిడీకి గురవుతున్నారని ఆయన అన్నారు. అసలు వస్తువు ఏది,నకిలీ వస్తువు ఏది అని గుర్తించే పరిజ్ఞానం వినియోగదారులకు లేదన్నారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ పై కూడా అవగాహన లేకపోవడం వ్యాపారులు, వినియోగదారులను మోసం చేస్తున్నారని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం లోని సాధారణ పౌరుడు మొదలుకొని దేశ ప్రథమ పౌరుడైన రాష్టప్రతి వరకు కూడా అందరూ వినియోగదారులే అన్న విషయం మరవరాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ శాఖలు కేవలం వినియోగదారుల సంక్షేమం కొసమే ఉన్నాయని, కానీ అసలు ఆ శాఖలు ఉన్నాయన్న సంగతి  కూడా చాలా మంది వినియోగదారులకు తెలియదన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ పై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. డిసెంబర్ 24 న జరిగే జాతీయ వినియోగదారుల దినోత్సవం వరకు ప్రజలను చైతన్య పరిచే భాగంలో  జర్నలిస్టులు క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -