- Advertisement -
ఉప్పల్‌కు మ్యాచ్‌ల కేటాయింపుపై జీవన్‌రెడ్డి హర్షం
హైదరాబాద్ : క్రికెట్‌ను అభివృద్ది పథంలో నడిపిస్తూ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రతిష్ట మరింత పెంచుతామని ఆ సంఘం కార్యదర్శి మన్నె జీవన్‌రెడ్డి అన్నారు. 2026-27 స్వదేశీ సీజన్లో ఉప్పల్ స్టేడియానికి రెండు మ్యాచ్‌లు కేటాయించటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘ఏడాది విరామం తర్వాత ఉప్పల్ స్టేడియానికి మ్యాచ్‌లు కేటాయించటం సంతోషం. గతంలో చూడని విధంగా స్టేడియాన్ని తీర్చిదిద్దుతాం. ఉప్పల్‌లో మరిన్ని మ్యాచ్‌లు నిర్వహించేందుకు కృషి చేస్తామని’ జీవన్ రెడ్డి అన్నారు. వెస్టిండీస్‌తో టీ20 (అక్టోబర్ 14), జింబాబ్వేతో వన్డే (జనవరి 6)కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
- Advertisement -



