నవతెలంగాణ – కుభీర్ : గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఆర్డబ్ల్యూఎస్ డీఈ అరుణ్ అన్నారు. బుధవారం కుబీర్ మండలంలోని ఆయా గ్రామాల్లో పర్యటించి, గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి ఇంటికి అందిస్తున్న మిషిన్ భగీరథ ద్వారా తాగు నీటి సర్పరాను ఆయన పరిశీలించారు. గ్రామంలో తాగు నీటి సమస్య టాలెత్తకుండా సిబ్బంది సహాయ శక్తులుగా పని చేయాలనీ అన్నారు. నీరు అందడం లేదని గ్రామస్తుల ద్వారా పిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. వర్ష కాలం కావడంతో గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకు లను శుభ్రం గా ఉంచాలన్నారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ సాగర్ రెడ్డి ని కలసి మండలంలో అందుతున్న తాగు నీటి సరఫరా పై చర్చించారు.
చాలా గ్రామాల్లో లికేజ్ ల సమస్య తీవ్రంగా ఉందని లికేజ్ ల సమస్యను పరిషకృంచాల్ని డి ఈ సూచించారు. తాగు నీటి సమస్య ఉన్న గ్రామాలపై ప్రత్యేక శ్రద్దా చూపాలన్నారు. సంబంధిత ఏ ఇ రాజన్న తాగు నీటి సమస్యలపై స్పందించడం లేదని పిర్యాదులు వస్తున్నాయని, పంచాయతీ కార్యదర్శి లు కూడా ఫోన్ చేసిన స్పందించడం లేదని డి ఈ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ సాగర్ రెడ్డి,ఎంపీఓ మోహన్ సింగ్ తదితరులు ఉన్నారు.
గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చూస్తాం: ఆర్డబ్ల్యూఎస్ డీఈ అరుణ్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES