నవతెలంగాణ – గోవిందరావుపేట : మండలంలో విద్యుత్తు అంతరాయం లేకుండా చూస్తామని జిల్లా డీఈ పులుసుం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మండలంలో పసర నాగరం ముయ్యాలమ్మ గుడి దగ్గర కొత్తగా ఏర్పరిచిన 63 కెవి విద్యుత్ ట్రాన్స్ఫారాన్ని విద్యుత్ ఉద్యోగులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో ఏ జి ఎల్ 100 కేవీ డిటిఆర్ ఓవర్ లోడ్ ఉన్న సందర్భంలో దానిమీద ఇంకో 63 కెవిఏ డీటీఆర్ వేయడం జరిగిందన్నారు. మండలంలో నిరంతరం విద్యుత్ అంతరాయం రాకుండా మండల ప్రజలకు విద్యుత్ ఉద్యోగులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని అన్నారు.
ఓవర్లో డిటిఆర్ ఎక్కడ ఉన్న సర్దుబాటు చేస్తామని అన్నారు. మండలంలో ఎక్కడ ఓవర్లోడ్ తో విద్యుత్ సమస్యలు లేకుండా అంతరాయం రాకుండా చేస్తామని అన్నారు. ఈ మధ్య కాలంలో మండలంలో ఓవర్ లోడ్ తో ఇబ్బందిగా ఉన్న ట్రాన్స్ఫారాలని గుర్తించి వాటికి అనుగుణంగా కొత్తగా 15 ట్రాన్స్ఫారాలు వేయడం జరిగింది అన్నారు. గోవిందరావుపేట, పసర, లక్ష్మీపురం ఏరియాలలో ఉన్న సబ్ స్టేషన్ల కింద ట్రాన్స్ఫారాలను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఎక్కడైనా ఓవర్లోడు అనిపించిన చోట కొత్త ట్రాన్స్ఫార్లను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.
రైతులందరికీ ఎంతో ఆనందం
గత ఎన్నో ఏండ్ల నుండి ప్రతి ఏటా ఓవర్ లోడ్ తో ఎన్నో ట్రాన్స్ఫారాలు కాలిపోతూ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని పసర గ్రామం మాజీ సర్పంచ్ పాయం నారాయణ అన్నారు. ఎల్లప్పుడూ విద్యుత్ అంతరాయం లేకుండా ఉంటే పంటలకు నీరు అందుతాయని విద్యుత్ అంతరాయం వల్ల ఎన్నోసార్లు పంటలకు నీరు అందక ఎండిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయని అన్నారు. కొత్త ట్రాన్స్ఫారం ప్రారంభించడం వల్ల ఇకనుండి నిరంతర విద్యుత్ రావడం వలన ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా ఉంటే పంటలకు నీరు అందుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ విద్యుత్ ఉద్యోగులకు అభినందనలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఏఈ దేవ్ సింగ్, లైన్ ఇన్స్పెక్టర్ దండు రామచందర్, కాంట్రాక్టర్ పాషా, సోమిరెడ్డి,పాయం నారాయణ, షరీఫ్, నాగేష్ రైతులు పాల్గొన్నారు.



