Monday, March 23, 2026
E-PAPER
Homeఆదిలాబాద్వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూస్తాం

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూస్తాం

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
రాబోయే వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జక్కు సుష్మా భూమేష్, తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గూగులావత్ సంగీత రవి నాయక్  తెలిపారు. సోమవారం మండలంలోని పొన్కల్ తిమ్మాపూర్  పంచాయతీ కార్యాలయంలో వేర్వేరుగా  నిర్వహించిన గ్రామసభలో వారు మాట్లాడారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ప్రతి ఒక్కరూ సకాలంలో ఇంటి పన్నులు చెల్లించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

పోన్కల్: నీటి సమస్యను పరిష్కరించాలని వినతి..
గ్రామంలోని వివిధ వార్డులలో ఏర్పడిన నీటి సమస్యను పరిష్కరించాలని పలు కాలనీల ప్రజలు కోరారు. సభలో ప్రజలు పలు సమస్యలను ప్రస్తావించారు. చాలా కాలనీలలో నీరు రావడంలేదని, మిషన్ భగీరథ పైప్ లైన్ లకు లీకేజీలను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జలపతి, ఈవో రాహుల్ తిమ్మాపూర్ కార్యదర్శి మేక లావణ్య వార్డు సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -