Monday, March 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం

హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం

- Advertisement -

– పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణ -హనుమకొండ చౌరస్తా

హమాలీలకు ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దనసరి సీతక్క వెల్లడించారు. ఆదివారం హనుమకొండ జిల్లాలో తెలంగాణ హమాలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన హమాలీ మహా గర్జన కార్యక్రమంలో వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి, ప్రొఫెసర్‌ కోదండరామ్‌, హమాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుంటి సామ్రాజ్యంతో కలిసి మంత్రి హాజరయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హమాలీ కార్మికులు పాల్గొని ఐక్యతను చాటారు. ముందుగాగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హమాలీలు చేపట్టిన భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్‌ జంక్షన్‌ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ హయగ్రీవాచారి మైదానం వరకు సాగింది. అనంతరం అక్కడి నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు. హమాలీలు రక్తాన్ని చెమటగా మార్చి కష్టాన్ని ఇష్టంగా చేసుకుని జీవనం సాగిస్తున్నారని, ఇంత పెద్ద స్థాయిలో ఒక వేదికపై చేరి తమ సమస్యలను చెప్పడం ఎంతో సంతోషకరమని అన్నారు. హమాలీలకు ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ బోర్డు ఏర్పాటు, హెల్త్‌ కార్డులు, ఇన్సూరెన్స్‌ వంటి అంశాలపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. తన కష్టంతో సంపాదించే ఏకైక వ్యక్తి కార్మికుడు అని అన్నారు. సమాజం అభివృద్ధి చెందడంలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. హమాలీల సమస్యలను తప్పకుండా అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ.. గ్రామాల్లో పనిచేసే హమాలీలకు కూర్చునేందుకు కూడా స్థలం లేకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి హమాలీల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా పని చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రచయిత మిట్టపల్లి సురేందర్‌, గాయకులు చుక్క రామ్‌ నర్సయ్య, కార్మికులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హమాలీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -