Tuesday, March 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజా రవాణా సేవలు విస్తరిస్తాం

ప్రజా రవాణా సేవలు విస్తరిస్తాం

- Advertisement -

– మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

గ్యాస్‌ ఆధారిత వాహనాలకు ప్రత్యామ్నాయంగా ప్రజా రవాణా సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు. గ్యాస్‌ ఆధారిత వాహనాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందనతోపాటు ఐవోసీఎల్‌, గోగ్యాస్‌, ప్రెంచ్‌కీ చెందిన టోటల్‌ ఎనర్జీ, సూపర్‌ గ్యాస్‌, ప్రమ్‌ గ్యాస్‌ తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ గ్యాస్‌ కొరతను తీర్చేందుకు ఐవోపీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రావాలని కోరారు. వాహనాలకు సరఫరా చేసే ఎల్పీజీ గ్యాస్‌ సరఫరాలో ఏర్పడిన సంక్షోబాన్ని నివారించేందుకు సరఫరాను పెంచాలని కోరారు. ఇదే అంశంపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హార్డిప్‌సింగ్‌ పూరీకి లేఖ రాయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. అదే సమయంలో గ్యాస్‌ ఆధారిత ఆటో సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుత పరిస్థితిని పారదర్శకంగా వివరించాలని అధికారులకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -