బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
గన్ పార్క్ వద్ద బీఆర్‌ఎస్ నిరసన
నవతెలంగాణ- సిటీబ్యూరో
ఆరు గ్యారంటీల అమలు మోసాన్ని అసెంబ్లీలో ఎండగడతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారంటీల అమలు వైఫల్యంపై బీఆర్‌ఎస్ నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద నిరసన తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మూడు నెలల్లోనే గ్యారంటీల అమలు చేస్తామని చెప్పి ప్రజల ఓట్లు సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడో బడ్జెట్ ప్రవేశపెట్టినా ఆ హామీలకు చట్టబద్ధత కల్పించలేదన్నారు.
బలహీన వర్గాలకు లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి తగిన నిధులు కేటాయించలేదని విమర్శించారు. రైతులకు రైతు భరోసా పేరుతో రూ.15 వేల సహాయం అందిస్తామని చెప్పి ఇప్పటికే ఉన్న పథకాలను కూడా సక్రమంగా అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఉద్యోగాల విషయంలో రెండు లక్షల హామీ ఇచ్చి కొద్దిమందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించడం యువతను మోసం చేయడమేనని అన్నారు. శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో రాష్ట్ర ప్రజల తరపున ఈ అంశాలను నిరంతరం ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
ఆరు గ్యారంటీల మోసాన్నిఅసెంబ్లీలో ఎండగడతాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



