Tuesday, July 1, 2025
E-PAPER
Homeజాతీయంరాజ్యాంగంలో ఏ పదాన్ని టచ్‌ చేసినా పోరాటం చేస్తాం : ఖర్గే

రాజ్యాంగంలో ఏ పదాన్ని టచ్‌ చేసినా పోరాటం చేస్తాం : ఖర్గే

- Advertisement -

బెంగళూరు: రాజ్యాంగంలో ఏ పదాన్ని టచ్‌ చేసినా కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సోమవారం పేర్కొన్నారు. రాజ్యాంగ పీఠికలోని ‘సోషలిస్టు’, ‘లౌకిక’ పదాలను తొలగించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే వ్యాఖ్యలపై స్పందిస్తూ ఖర్గే ఈ ప్రకటన చేశారు. హోసబాలేను ‘మనుస్మృతి వ్యక్తి’కు చెందిన వ్యక్తిగా ఖర్గే విమర్శించారు. బెంగళూరులోని తన నివాసంలో ఖర్గే విలేకరులతో మాట్లాడారు. ‘ఆయన (హోసబాలే) పేదవారు ఉన్నత స్థితిలోకి రావాలని కోరుకోవడం లేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆచారాలను ఇప్పటికీ కొనసాగాని కోరుకుంటున్నాడు. అందుకే ఆయనికి సోషలిజం, లౌకికవాదంతో పాటు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి పదాలు ఇష్టం ఉండవు’ అని ఖర్గే అన్నారు. ఇది కేవలం హోసబాలే పంథా మాత్రమే కాదని, ఆర్‌ఎస్‌ఎస్‌ పంథా కూడా అని ఖర్గే చెప్పారు. ”ఆర్‌ఎస్‌ఎస్‌ ఎల్లప్పుడూ పేదలు, అణగారిన వర్గాలు, షెడ్యూల్డ్‌ కులాలు, ఇతర వర్గాలకు వ్యతిరేకం” అని ఖర్గే తెలిపారు. నిజంగా ఆర్‌ఎస్‌ఎస్‌కు వీరి ప్రయోజనాల మీద అంత ఆసక్తి ఉంటే, అంటరానితనాన్ని ఎప్పుడో తొలగించి ఉండేవారని అన్నారు. ‘వారు (ఆర్‌ఎస్‌ఎస్‌) హిందూ మతానికి నాయకత్వం వహిస్తున్నారని చెప్పుకుంటున్నారు. వారు అలా (నాయకత్వం) చేస్తే, ముందుగా అంటరానితనాన్ని తొలగించాలి’ అని ఖర్గే పేర్కొన్నారు. అంటరానితనాన్ని తొలగించి దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ తన స్వచ్ఛంద సేవకులందరినీ నియమించాలని ఖర్గే తెలిపారు. కానీ, దానికి బదులుగా, దేశంలో ఆందోళన, గందరగోళం సృష్టించడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని చెప్పారు. అలా చేయడం చెడ్డదని, మేము దానిని వ్యతిరేకిస్తున్నామని ఖర్గే తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -