Saturday, March 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవెలుగుమట్ల నిర్వాసితుల ఇండ్ల సాధనకు పోరాడుతాం

వెలుగుమట్ల నిర్వాసితుల ఇండ్ల సాధనకు పోరాడుతాం

- Advertisement -

వ్యవసాయ కార్మిక సంఘం రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ -ఖమ్మం

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో 13 ఏండ్ల నుంచి నివాసం ఉంటున్న పేదల ఇండ్లను ప్రభుత్వం దుర్మార్గంగా నేలమట్టం చేసిందని, వారందరికీ ఇండ్లు నిర్మించి ఇచ్చే వరకూ పోరాడుతామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌, జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి సిద్దినేని కరుణాకర్‌, మాస్‌ లైన్‌ రైతు కూలీ సంఘం నాయకులు లింగయ్య అన్నారు. శుక్రవారం ఖమ్మంలోని మంచికంటి హాల్‌లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వారు మాట్లాడారు. బాధితులకు 2014లోనే భూదాన్‌ యజ్ఞ బోర్డు అర్హత పత్రాలు ఇచ్చిందని, దాని అనుగుణంగా వారికి ప్రభుత్వం వారికి రోడ్లు, కరెంటు, మంచినీటి సౌకర్యం కల్పించి పక్కా గృహాలు నిర్మించాల్సిందిపోయి నిట్ట నిలువునా వాళ్ల ఇండ్లను నేలమట్టం చేయటం దుర్మార్గపు చర్య అని అన్నారు. భూదాన్‌ భూమి అంటేనే పేద ప్రజలకు, ఇల్లు లేని వారికి ఇచ్చేది అని తెలిపారు. బాధితుల పక్షాన ఈనెల 9న కలెక్టర్‌ని కలవనున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి లేఖలు రాయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యర్రా శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వై.విక్రం, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాదినేని రమేష్‌, బొంతు రాంబాబు, ఐద్వా జిల్లా అధ్యక్షులు మెరుగు రమణ, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శులు తుడుం ప్రవీణ్‌, బొడ్డు మధు, పెద్ద బీరవెల్లి సర్పంచ్‌ చింతలచెరువు కోటేశ్వరరావు, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీనారాయణ, సదానందం, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -