Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పెన్షన్లను పెంచకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం: మందకృష్ణ మాదిగ

పెన్షన్లను పెంచకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం: మందకృష్ణ మాదిగ

- Advertisement -

పాలక, ప్రతిపక్షాల నిర్లక్ష్యమే వికలాంగులకు, వితంతులకు శాపం 
పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ద 3న హరాబాదులో మహా గర్జన
వికలాంగుల సదస్సులో మందకృష్ణ మాదిగ 
నవతెలంగాణ – పాలకుర్తి

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆధారంగా వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ఇచ్చిన పెన్షన్ హామీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకుంటామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. మంగళవారం మండల కేంద్రంలో గల బషారత్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి వికలాంగుల సమావేశంలో మందకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నప్పటికీ పెన్షన్లు పెంచడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీల ప్రకారం వికలాంగులకు, వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు పాలక పక్షం పెన్షన్లు పెంచాల్సి ఉండగా పెంచడం లేదని, ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉన్నప్పటికీ ప్రశ్నించడం లేదని ఆరోపించారు. పాలక, ప్రతిపక్షాల నిర్లక్ష్యం వల్లనే పెన్షన్లు తీసుకునే పేదలకు శాపంగా మారిందన్నారు.

పాలక, ప్రతిపక్షాల్లో ఉన్న వారందరూ పేదల సమస్యలు తెలువని అన్నారు. పాలక పక్షాన్ని ప్రశ్నించని నాయకుడికి సీఎంగా, ప్రతిపక్ష నాయకుడిగా పనికిరాడని స్పష్టం చేశారు. అర్హులైన వికలాంగులకు, వృద్ధులకు చేయూత పెన్షన్లు పెంచుతామని కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాయని తెలిపారు. రెండు పార్టీలకు బాధ్యతలు ఉన్నప్పటికీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పాలక, ప్రతిపక్ష పార్టీలు స్పందించకపోవడంతోనే పేదల బిడ్డగా పెన్షన్ల పెంపు పట్ల పాలక పక్షాన్ని ప్రశ్నిస్తున్నానని తెలిపారు. ఇచ్చిన హామీని అమలు చేయమని కోరుతున్నామని అన్నారు. రాష్ట్రంలోని 50 లక్షల మంది వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళల ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని తెలిపారు.

పెన్షన్లు పెంచకపోవడంతో ఒక్కో పెన్షన్ దారుడు సంవత్సరానికి రూ.40000 నష్టపోయాడని తెలిపారు. పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డితో తాడోపేడో తేల్చుకునేందుకు సెప్టెంబర్ 3న హైదరాబాదులో పెన్షన్ దారులతో మహా గర్జనను నిర్వహిస్తున్నామని తెలిపారు. పెన్షన్ పెరగాలన్న, పెన్షన్ రావాలన్న వికలాంగులందరూ మహా గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సెప్టెంబర్ 3న హైదరాబాదుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ మొదటి వారంలో పెన్షన్లు పెంచకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జనగామ జిల్లా ఇంచార్జీ బోడ సునీల్, వీహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి కుమార్, విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిర్రు నగేష్, ఎమ్మెస్ ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు తోకల చిరంజీవి, ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షుడు గద్దల కిషోర్, దిండిగళ్ళ వెంకన్న,గుండాల రవి, ఆనంతజు రమేష్, వలపు వెంకన్న, శీల అంజయ్య, సందెన రవిందర్, జేరిపోతుల సుధాకర్, బొట్ల మహేష్, చేరుపల్లి యాదగిరి స్వామి, దండు రామచంద్రు, జలగం నరేశ్, యాకమల్లు శ్రీధర్, నాగరాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img