Saturday, September 13, 2025
E-PAPER
Homeజిల్లాలునల్లచెరువు కట్టను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే మేఘారెడ్డి

నల్లచెరువు కట్టను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే మేఘారెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి  
వనపర్తి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మినీ ట్యాంక్ బండ్ (నల్లచెరువు కట్ట) ను ఎంతో ఆహ్లాద భరితంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మినీ ట్యాంక్ బండ్ పై రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న మెయిన్ గేట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అధునాతనంగా నిర్మించే ఈ మెయిన్ గేట్ నిర్మాణంతో ట్యాంక్ బండ్ ఎంత శోభాయమానంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డు అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా యూత్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, వనపర్తి పట్టణ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మెన్ పాకనాటి కృష్ణయ్య, లక్కాకుల సతీష్, కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -