Monday, April 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా-ఇజ్రాయిల్‌కు సర్‌ప్రైజ్‌ ఇస్తాం : ఇరాన్‌

అమెరికా-ఇజ్రాయిల్‌కు సర్‌ప్రైజ్‌ ఇస్తాం : ఇరాన్‌

- Advertisement -

టెహ్రాన్‌ : అమెరికా-ఇజ్రాయిల్‌ దళాలకు త్వరలోనే పెద్ద సర్‌ప్రైజ్‌ ఇస్తామని ఇరాన్‌ తెలిపింది. ఈ మేరకు ఇరాన్‌ భద్రతాధికారి ఓ ప్రకటన చేస్తూ నిర్దిష్ట లక్ష్యాల సాధన కోసం, సొంత ప్రణాళికల అమలు కోసమే తాము యుద్ధం చేస్తున్నామని తెలిపారు. అమెరికా లక్ష్యాల జాబితా లోపభూయిష్టంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. ‘ఇరాన్‌ బ్రిడ్జిలపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెబుతున్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే వారి సైనిక చర్యలు విఫలమవుతున్నాయి. అమెరికా యుద్ధ విమానాలను మేము కూల్చివేశాం’అని ఆయన తెలిపారు.

హార్ముజ్‌పై ఇరాన్‌, ఒమన్‌ చర్చలు
హార్ముజ్‌ జలసంధిలో నౌకల రవాణాను అనుమతించే విషయంపై ఇరాన్‌, ఒమన్‌ దేశాల విదేశీ మంత్రిత్వ శాఖలకు చెందిన సహాయ మంత్రులు చర్చలు జరిపారు. ఇరు పక్షాలకూ చెందిన నిపుణులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో హార్ముజ్‌ జలసంధి మీదుగా నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది. ఇరు దేశాలకూ చెందిన నిపుణులు అనేక ప్రతిపాదనలు సమర్పించారని, వాటిని అధ్యయనం చేస్తామని ఒమన్‌ ప్రభుత్వం తెలియజేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -