నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో అన్ని జడ్పిటిసిలు గెలిచి జడ్పిటిసి పీఠం చేసుకుని , బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయనతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, పైల శేఖర్ రెడ్డి లు మాట్లాడుతూ అబద్ధపు పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఈ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి, గ్రామాలలో అన్ని సౌకర్యాలు నర్సరీ హరితహారం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వైనం, రైతు వేదికలు నిర్మాణాలు చేపట్టి గ్రామాలను స్వర్గ ధామాలుగా చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం కేసీఆర్ ను విమర్శించకుండా ఏ ఒక్క మాట కూడా మాట్లాడని పరిస్థితి నెలకొందని, సీఎం రేవంత్ రెడ్డి కలలో కూడా కేసీఆర్ ని తలచుకొని ఉలిక్కిపడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ నాయకునిగా ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రతి గ్రామాన్ని తిరిగి ప్రతి సమస్యను తెలుసుకొని వాటిని పరిష్కరించాడని అన్నారు. రాష్ట్రాన్ని పాలించమని అధికారం ఇస్తే , అప్పులు ఉనాయి డబ్బులు లేవని చెప్పడం పరిపాలన చాతగాని తనమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ ,ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామాలను ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, యాదాద్రి భువనగిరి జిల్లాకు గోదావరి జిల్లాల దిక్కు అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగమైన మేడిగడ్డను పట్టుకొని ప్రాజెక్టు కూలిపోయిందని ప్రచారం చేసి ఉన్న నీటిని సముద్రం పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కన్నె పల్లి పంప్ హౌస్ను నుంచి రోజుకు రెండు టీఎంసీలు చొప్పున నీటిని మల్లన్న సాగర్,, కొండపోచమ్మ రిజర్వాలకు తరలించడం ద్వారా బస్సాపూర్ రిజర్వాయర్ కి నీళ్ళు చేరడంతో భువనగిరి , ఆలేరు నియోజకవర్గాలకు సాగునీటి కొరత తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి, కల్లూరి రామచంద్ర రెడ్డి, జిల్లా నాయకులు సుబ్బురు బీరు మల్లయ్య, తోటకూర అనురాధ , కార్యకర్తలు పాల్గొన్నారు
స్థానిక ఎన్నికల్లో భువనగిరి ఖిలాపై బీఆర్ఎస్ జండా ఎగరవేస్తాం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES