Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుభూభారతిలో రైతుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం..

భూభారతిలో రైతుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం..

- Advertisement -

నాయాబ్ తసిల్ల హేమలత, ఆర్ఐ రామ పటేల్..
నవతెలంగాణ – జుక్కల్ 
: మండలంలోని గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులలో దరఖాస్తులు ఇచ్చిన రైతుల సమస్యలను వెంటనే సాధ్యమైనంత వరకు పరిష్కరించడం జరుగుతుందని జుక్కల్ నయాబ్ తహసిల్దార్ హేమలత , ఆర్ఐ రామ్ పటేల్ అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ తాసిల్దార్, ఆర్ఐ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రవేశపెట్టిన నాటినుండి గ్రామాలలో భూవివాదాలు , భూ సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపడం మంచి అవకాశం అని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగపరుచుకుంటే భవిష్యత్ తరాలకు బావుంటుందని వారు పేర్కొన్నారు. అదేవిధంగా అంతకుముందు మండలంలో కంఠాలీ గ్రామంలో డిప్యూటీ తాసిల్దార్ హేమలత మరియు పెద్ద ఎడిగి గ్రామంలో ఆర్ ఐ రామ్ పటేల్ నేతృత్వం వహించారు. భూ సమస్యలలో అత్యధికంగా పట్టా పాసు బుక్కులలో పట్టదారుల పేర్లు తప్పుగా దొర్లడం, సర్వే నెంబరు సంఖ్యలు తప్పుగా రావడం, చిరునామాలు తప్పుగా ముద్రించడం ఇటువంటి సమస్యల గురించి అత్యధికంగా దరఖాస్తులు వస్తున్నాయని అని తెలిపారు. వాటిని జిల్లా అధికారులకు సమస్యల విషయాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా సమాచారాన్ని దరఖాస్తులను పంపించడం జరుగుతుంది  తెలిపారు. రెవెన్యూ సదస్సుల అనంతరం సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించి రైతుల సమస్యలు దూరం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిపి సెక్రెటరీ అనురాధా, పెద్ద ఏడిగి సెక్రెటరీ నాగయ్య , గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు .

 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad