- Advertisement -
మంత్రి వివేక్ వెంకటస్వామి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రానున్న రోజుల్లో గిగ్ వర్కర్ల (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ, సంక్షేమం) చట్టం 2026ను అమలు చేస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం సోమాజీగూడలోని మంత్రి నివాసంలో తెలంగాణ ప్లాట్ ఫామ్, గిగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు షేక్ సలావుద్దీన్ నేతృత్వంలో నాయకులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంలో గిగ్ వర్కర్ల పాత్ర కీలకంగా ఉందని అభినందించారు.
- Advertisement -



