మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీసీల కోసం ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. శాసనమండలి లో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. బీసీ కార్పొరేషన్లను బలోపేతం చేస్తామనీ, కళ్యాణలక్ష్మికి ఒక్క కేసు కూడా పెండింగ్‌లో లేదనీ, గ్రీన్ చానెల్ ద్వారా క్లియర్ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆత్మగౌరవ భవనాలకు నిధులను కేటాయించి పూర్తి చేస్తామని తెలిపారు. విదేశీ స్కాలర్‌షిప్‌ల సంఖ్యను 300 నుంచి 700కు పెంచినట్టు చెప్పారు. బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తున్నామన్నారు. సంచార జాతులకు కార్పొరేషన్ ఏర్పాటు అంశం పరిశీలనలో ఉందని మంత్రి వెల్లడించారు.
మధుసూదనాచారి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని విమ ర్శించారు. నిధులు తక్కువ కేటాయించి అందులో 10శాతం కూడా ఖర్చు చేయలేదని విమర్శిం చారు. సభ్యులు బండా ప్రకాష్ మాట్లాడుతూ బీసీ సబ్ ప్లాన్ చట్టం తెస్తారా? లేదా? చెప్పాలని ప్రశ్నించారు. సభ్యులు తీన్మార్ మల్లన్న మాట్లా డుతూ బీసీలకు పదేండ్లు కేటాయించిన నిధులను గత బీఆర్ఎస్ సర్కార్ ఖర్చు చేయలేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తున్నదని విమర్శించారు. సభ్యులు ఎల్.రమణ మాట్లా డుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 బడ్జెట్లలో బీసీలకు కేటాయించిన నిధుల్లో ఒక శాతం కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బదులిస్తూ, కాంగ్రెస్ సామాజిక న్యాయానికి ఛాంపియన్ అనీ, బీసీలకిచ్చిన హామీలన్ని అమలు చేస్తామని చెప్పారు. దీంతో శాంతించని బీఆర్ఎస్ సభ్యులు బీసీలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
మరో ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిస్తూ, గతంతో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరిగాయన్న దాంట్లో వాస్తవం లేదని తెలిపారు. రోడ్డు భద్రతా కార్యక్రమాలతో అవగాహనా కల్పిస్తున్నామనీ, కొత్తగా నమోదయ్యే వాహనాలపై రోడ్డు సేఫ్టీ సెస్సును ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఇంకో ప్రశ్నకు ఆయన, పాత వాహనాల స్క్రాపింగ్‌ను ప్రోత్సహించడానికి ప్రభుత్వ రుణ బాధ్యతల మాఫీని, పన్ను రాయితీలను కల్పిస్తూ స్క్రాపింగ్ పాలసీని అమలు చేస్తున్నట్టు తెలిపారు.
కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



